ఆత్మీయత, అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: గవర్నర్

ఆత్మీయత, అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: గవర్నర్

HYD: ఆత్మీయత, అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ అని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. రక్తసంబంధం, మానవ మమతను గుర్తు చేసే రాఖీ పౌర్ణమి సోదర భావాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. శనివారం HYD రాజ్ భవన్‌లో విశ్వహిందూ పరిషత్, మాతృశక్తి, దుర్గావాహిని నాయకులు గవర్నర్‌కు రాఖీ కట్టి మంగళ హారతులు ఇచ్చారు. మహిళా నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు.