కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి గ్యాస్ సెగ
దేశవ్యాప్తంగా నెలకొన్న కమర్షియల్ గ్యాస్ కొరత ఇప్పుడు ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయాన్ని (AICC) తాకింది. ఏఐసీసీ క్యాంటీన్‌లో కేవలం 2-3 రోజులకు సరిపడా సిలిండర్లు మాత్రమే ఉండటంతో, వంట విషయంలో ఆచితూచి అడుగు వేస్తున్నారు. ముఖ్యంగా గ్యాస్ ఎక్కువగా ఖర్చయ్యే దోశల విక్రయాలను నిర్వాహకులు నిలిపివేశారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల గ్యాస్ సమస్య దేశవ్యాప్తంగా తలెత్తింది.