డ్రోన్ కెమెరాలతో అసాంఘిక శక్తులపై నిఘా
SS: ధర్మవరం, బుక్కపట్నం ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలు, బహిరంగ మద్యపానం, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను అరికట్టేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. ధర్మవరం టూటౌన్ సీఐ రెడ్డప్ప నేతృత్వంలో అటవీ ప్రాంతాలు, ఇతర మార్గాల్లో డ్రోన్ల ద్వారా భౌగోళిక పరిస్థితులను రికార్డు చేశారు.