నామినేషన్ సెంటర్‌ను పరిశీలించిన ఎంపీడీవో
KMM: వేంసూర్ మండలంలోని వి. వెంకటాపురం నామినేషన్ సెంటర్‌ను ఎంపీడీవో కావ్య నిన్న పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని సిబ్బందికి సూచించారు. నామినేషన్ల స్వీకరణ తీరు, అభ్యర్థులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో పాల్గొన్నారు.