పన్ను వసూళ్లలో 4వ స్థానంలో అద్దంకి

పన్ను వసూళ్లలో 4వ స్థానంలో అద్దంకి

ప్రకాశం: పన్ను వసూళ్లలో రాష్ట్రంలోని పలు పురపాలక సంఘాల్లో అద్దంకి పురపాలక సంఘం 4వ స్థానంలో నిలిచిందని కమిషనర్ రవీంద్ర తెలిపారు. పన్నుల వసూళ్లలో ప్రజల సహకారం, సిబ్బంది కృషితో కొన్ని సంవత్సరాలుగా పురపాలక సంఘం పన్ను వసూళ్లలో ముందంజలో ఉండడం సంతోషించదగ్గ విషయమన్నారు. అలాగే బాపట్ల జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు.