గుంతల రోడ్లతో తీవ్ర ఇబ్బందులు
NRPT: దామరగిద్ద మండలంలోని లోకుర్తి, నర్సాపూర్, అన్నాసాగర్, ఉల్లిగుండం గ్రామాల్లో రహదారులు గుంతలమయంగా మారాయి. కంకర తేలి రోడ్లు అధ్వానంగా ఉండడంతో వాహనదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికంటే పశువుల బాటలే మేలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారులకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.