'స్వచ్ఛ గ్రామాలతోనే ఆరోగ్యవంతమైన సమాజం'

'స్వచ్ఛ గ్రామాలతోనే ఆరోగ్యవంతమైన సమాజం'

SKLM: రణస్థలం M పైడి భీమవరంలో శుక్రవారం చెత్త సంపద కేంద్రంలో పంచాయతీ కార్యదర్శులు, క్లాప్ మిత్రలకు ఇవాళ ఒక రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ ఎంపీడీఓ ప్రసాద్ మాట్లాడుతూ, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో క్లాప్ మిత్రల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. స్వచ్ఛ గ్రామాలు నిర్మితమైతేనే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని అన్నారు.