ఈ నెల 31న సీఐటీయూ సమావేశం
కరీంనగర్ కోతి రాంపూర్ సీఐటీయూ కార్యాలయంలో ఈ నెల 31న సమావేశం నిర్వహించనున్నట్టు పార్టీ నేత పున్నం రవి తెలిపారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్, స్వీపర్స్ సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తామన్నారు. కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ వంటి హక్కులు తదితర అంశాల గురించి చర్చిస్తామని, సమావేశానికి పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.