ఎరువుల కొరత తీర్చేందుకు కేంద్రం చర్యలు
దేశవ్యాప్తంగా యూరియా ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర చర్యలు చేపట్టింది. ఎరువుల ప్లాంట్లకు LPGని అదనంగా సరఫరా చేయాలని నిర్ణయించింది. స్పాట్ మార్కెట్ నుంచి బిడ్డింగ ద్వారా అదనంగా 7.31 మిలియన్ మెట్రిక్ క్యూబిక్ మీటర్స్ పర్ డే గ్యాస్‌ను కొనుగోలు చేసేందుకు ప్లాంట్లకు అనుమతినిచ్చింది. అలాగే అమోనియాను విడిగా విక్రయించవద్దని దానిని పూర్తిగా యూరియా తయారీకే వాడాలని ఆదేశించింది.