నేడు PGRS కార్యక్రమం

నేడు PGRS కార్యక్రమం

ELR: రాష్ట్ర ప్రభుత్వం PGRS సేవలను మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలకు విస్తరించిందని ఏలూరు కలెక్టర్ K.V.వెట్రిసెల్వి తెలిపారు. సోమవారం జిల్లాలోని స్థానిక కార్యాలయాల్లో ఫిర్యాదులను నేరుగా సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఇంటి నుంచే ఆన్లైన్ ఫిర్యాదు, స్థితి తెలుసుకోవాలంటే meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా లేదా 1100 నెంబర్లను ఉపయోగించవచ్చని పేర్కొన్నారు.