24 గంటలూ అందుబాటులో ఉంటా: డాక్టర్ ప్రీతి

CTR: తవణంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటానని శుక్రవారం డాక్టర్ ప్రీతి పేర్కొన్నారు. వర్షాకాలంలో నీటి వల్ల వ్యాధులు ఎక్కువగా వస్తున్నందున శుభ్రమైన నీరు, పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.