9 కోట్ల మంది శరణార్థులకు ముప్పు

9 కోట్ల మంది శరణార్థులకు ముప్పు

ఇరాన్ యుద్ధాన్ని త్వరగా ముగించడానికి నాటో దేశాలు అమెరికాకు మద్దతు ఇవ్వాలని హంగేరీ ప్రధాని విక్టర్ ఆర్బాన్ కోరారు. లేదంటే అది ప్రపంచ విపత్తుగా మారుతుందని హెచ్చరించారు. ముఖ్యంగా 9 కోట్ల జనాభా ఉన్న ఇరాన్ అస్థిరమైతే యూరప్‌కు భారీగా వలసలు పెరుగుతాయని, ఇంధన ధరలు ఆకాశాన్నంటుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో శరణార్థుల వల్ల ఎదురైన సంక్షోభ పరిస్థితులను ఆయన గుర్తు చేశారు.