నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VZM: బొబ్బిలి మండలం పెంట సబ్‌స్టేషన్ పరిధిలోని రంగరాయపురం ఫీడర్‌కు సోమవారం మరమ్మతు పనులు చేపడుతున్నట్లు ఈఈ బీ. రఘు తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని వెల్లడించారు. రంగరాయపురం, జె. రంగరాయపురం, చెల్లారపువలస, ఎం.బూర్జవలస గ్రామాలు పంట వ్యవసాయ మోటార్లకు విద్యుత్ అంతరాయం ఉంటుందని చెప్పారు. ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.