బాహుబలి యూనివర్స్‌లో కొత్త మూవీ ప్రకటన
బాహుబలి యూనివర్స్‌లో 'బాహుబలి: ది ఎటర్నల్ వార్' పేరిట 3D యానిమేషన్ మూవీ రాబోతుంది. 'బాహుబలి: ది ఎపిక్' చివరిలో ఈ మూవీ టీజర్ ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని రాజమౌళి సమర్పణలో ఇషాన్ శుక్లా తెరకెక్కించనున్నారు. 2027లో ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది. రూ. 120కోట్ల బడ్జెట్‌తో రూపొందించనున్న ఈ మూవీలో బాహుబలి, ఇంద్రుడు మధ్య యుద్ధాన్ని చూపించనున్నట్లు సమాచారం.