గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్: ఎస్సై

గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్: ఎస్సై

SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ బీఆర్ నగర్‌లో గంజాయిని సేవిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎస్సై బాలరాజు శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో ఆమదాలవలస పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుంచి 2 కేజీల గంజాయి స్వాధీన చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.