యువకుడి ఆత్మహత్య

జగిత్యాల: కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన 19 ఏళ్ల మంతెన ప్రవీణ్ సోమవారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు వ్యవసాయ పనుల నిమిత్తం బయట ఉండగా, ప్రవీణ్ ఒక్కడే ఇంటిలో ఉన్నాడు. అతని ఆత్మహత్యకు కారణం తెలియాల్సి ఉందని గ్రామస్థులు తెలిపారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.