VIDEO: కాళేశ్వరంలో భక్తిశ్రద్ధలతో వసంత పంచమి వేడుకలు
భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో వసంత పంచమి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ శ్రీ సరస్వతీ దేవి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు చేశారు. ఆలయాధికారులు చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించగా, త్రివేణి సంగమం వద్ద సరస్వతీ మాత విగ్రహాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు.