పుంగనూరులో కారు ఢీకొని వ్యక్తి మృతి

CTR: కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన పుంగనూరు పట్టణంలో సోమవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు భగత్ సింగ్ కాలనీ మినీ బైపాస్ రోడ్డు సర్కిల్ వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొంది. ప్రమాదంలో వెంకటరమణారెడ్డి (48) అక్కడికక్కడే మృతి చెందారు. మాధవ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.