VIDEO: తొలి ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే

WNP: ఏదుల మండలం చిర్కేపల్లి గ్రామంలోని గాంధీ నగర్‌కు చెందిన రేణుక-ఎల్ల స్వామిల నూతన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి హాజరయ్యారు. కాగా.. ఇది జిల్లాలో తొలి ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం కావడం విశేషం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రౌసిడింగ్ ఇచ్చిన రోజు ఇచ్చిన మాట ప్రకారం దంపతులకు నూతన వస్త్రాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.