VIDEO: అనపర్తిలో ఘనంగా సుబ్రహ్మణ్య స్వామి కావిడి ఉత్సవం
E.G: సుబ్రహ్మణ్య స్వామి షష్ఠిని పురస్కరించుకుని అనపర్తి వీర్రాజు మామిడి వద్ద వేంచేసియున్న శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కావడి ఉత్సవం సోమవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు చందుశర్మ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుబ్రహ్మణ్య మాలధారులు సుబ్రహ్మణ్య కావడి భుజాన ధరించి పేటతుళ్లి ఆడుతూ స్వామివారికి గ్రామోత్సవం నిర్వహిచారు.