ధాన్యం కొనుగోళ్లపై ఆర్డీవో ఆకస్మిక తనిఖీ
NTR: విస్సన్నపేట మండలం పుట్రేలలో రైతులు ఆరబోసిన ధాన్యాన్నిఇవాళ తిరువూరు ఆర్డీవో మాధురి పరిశీలించారు. అనంతరం ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని విక్రయించాలని రైతులకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీ కళ్యాణి, మండల వ్యవసాయ అధికారి టిప్పు సుల్తాన్ పాల్గొన్నారు.