పట్టాదారు పాసుపుస్తకాలు క్షేత్రస్థాయిలో పరిశీలన
VZM: నెలిమర్ల మండల పరిధిలోని కొండగుంపాంలో జరుగుతున్న పట్టాదారు పాసు పుస్తకాల వెరిఫికేషన్ ప్రక్రియను జేసీ సేధు మాధవన్ బుధవారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో సిబ్బంది నిర్వహిస్తున్న రికార్డుల పనితీరును స్వయంగా పర్యవేక్షించారు. ఆనంతరం ఫీల్డ్ స్టాప్‌తో సమావేశం నిర్వహించి, విధి విధానాలపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.