VIDEO: చిలకలూరిపేటలో అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ
PLD: చిలకలూరిపేట బచ్చు ఆదినారాయణ వీధిలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా తయారైంది. చిన్న వర్షానికే మురుగునీరు రోడ్లపైకి వస్తోంది. దీంతో వీధులు చెరువులను తలపిస్తున్నాయి. దోమలు పెరిగి అంటువ్యాధులు వస్తాయని జనం భయపడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని, డ్రైనేజీ సమస్య పరిష్కరించకుంటే ఆందోళన చేస్తామని స్థానికులు హెచ్చరించారు.