'వ్యాధి లక్షణాలు సకాలంలో గుర్తించాలి'
PPM: అసంక్రమిత వ్యాధి లక్షణాలు సకాలంలో గుర్తించి తగు చికిత్స అందించాలని జిల్లా ఎన్.సి.డి అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు స్పష్టం చేశారు. హెచ్. కారాడవలసలో నిర్వహిస్తున్న సంచార చికిత్సా శిబిరాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో ఎంత మందికి శిబిరంలో ఆరోగ్య తనిఖీలు జరిపారు, వారి సమస్యలు, చికిత్సా వివరాలు రికార్డులో పరిశీలించారు.