గుండెపోటుతో పూజారి మృతి
NLR: పొదలకూరు పట్టణంలోని రామమందిరం వీధిలో నివాసముండే వ్యాకరణం వెంకటసుబ్బారావు ఇవాళ గుండెపోటుతో మృతిచెందారు. గుండెల్లో నొప్పి రావడంతో ఆయనను నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గతంలో శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంకు పూజారిగా ఆయన సేవలందించారు.