'దువ్వూరు-ప్రొద్దుటూరుకు ఆర్టీసీ బస్సులు నడపాలి'

KDP: దువ్వూరు మండల కేంద్రం నుండి దువ్వూరు-ప్రొద్దుటూరుకు ఆర్టీసీ బస్సులు నడపాలని దువ్వూరు మండల ప్రజలు విన్నవించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందని కానీ దువ్వూరు మండల మహిళలు దువ్వూరు నుండి ప్రొద్దుటూరుకు ఉచితంగా ప్రయాణం చేసే అదృష్టానికి నోచుకోవడం లేదని ఆర్టీసీ వారు బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.