ఎన్నికల ఫీవర్.. గెలుపే లక్ష్యంగా అప్పులు
కామారెడ్డి జిల్లాలో ఎన్నికల కోలాహలం మొదలైంది. బరిలో దిగుతున్న అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా భారీగా ఖర్చులకు సిద్ధమవుతున్నారు. గెలుపు కోసం అభ్యర్థులు ఆస్తులు అమ్ముకోవడానికి, తనఖా పెట్టడానికి కూడా వెనుకాడడం లేదు. తమ బంధువుల ద్వారా అప్పులు తెచ్చి మరీ ప్రచారాన్ని హోరెత్తించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.