ప్రజా దర్బార్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే
SKLM: ఆమదాలవలసలోని స్థానిక టీడీపీ కార్యాలయ ఆవరణలో ఇవాళ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ హాజరై ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరించారు. ప్రజలు తాగునీరు, రహదారులు, నివాస గృహాలు, పెన్షన్లు, వెల్ఫేర్ పథకాలు వంటి పలు అంశాలకు సంబంధించిన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు.