కఠిన శిక్ష పడేలా చర్యలు: మంత్రి

VZM: రామభద్రపురం మండలంలో జరిగిన అత్యాచార ఘటనపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు స్పందించారు. ఘోషా ఆసుపత్రికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. వైద్యాధికారులతో మాట్లాడారు. ప్రశాంతమైన జిల్లాలో ఇటువంటి ఘటనలు జరగడం బాధాకరమని.. చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు.