మధిరలో సినీ తార

మధిరలో సినీ తార

KMM: సినీనటి అనసూయ భరద్వాజ్ మధిరలో సందడి చేశారు. పట్టణంలోని ఓ ఫ్యాషన్ మాల్‌ను ఆమె ప్రారంభించి పలు డిజైన్ల వస్త్రాలను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు మధిర పట్టణం సరిహద్దుగా ఉండటంతో సమీప ప్రాంతాల నుంచి అభిమానులు అనసూయను చూసేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు.