ఇదే స్ఫూర్తి కొనసాగించాలి: మాజీ మంత్రి
NLG: మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మర్రిగూడెంలో సోమవారం ఆకస్మికంగా పర్యటించారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపొందిన సర్పంచులను ఆయన సన్మానించారు. రానున్న ఎన్నికల్లో మండలంలోని బీఆర్ఎస్ కార్యకర్తలు ఇదే స్ఫూర్తి కొనసాగించాలని దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నూతన సర్పంచ్లు వల్లముల సంతోష్ యాదవ్, రొక్కం భాస్కర్ రెడ్డి, కమ్మ చిచ్చు వెంకటేష్, తులసి తదితరులు పాల్గొన్నారు.