నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డివిజనల్ పంచాయతీ అధికారి
KMR: ఎల్లారెడ్డి మండలంలోని అడవి లింగాల్, లక్ష్మాపూర్, ఎల్లారెడ్డి ఎంపీడీవో కార్యాలయంలోని నామినేషన్ కేంద్రాలను మంగళవారం డివిజనల్ పంచాయతీ అధికారి సురేందర్ పరిశీలించారు. క్షుణ్ణంగా పరిశీలించి అధికారులు నామినేషన్‌లను తీసుకోవాలని సూచించారు. వాటికి సంబంధించిన పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తహర బేగం, ఎంపీవో ప్రకాష్ పాల్గొన్నారు.