పట్టణంలోని రాజహంస అపార్ట్‌మెంట్‌లో మాక్ డ్రిల్

ATP: పట్టణంలోని రాజహంస అపార్ట్‌మెంట్‌లో జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ ఆదేశాల మేరకు ప్రభుత్వ శాఖల సమన్వయంతో మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో చూపించేందుకు ఈ మాక్ డ్రిల్ నిర్వహించామని అధికారులు తెలిపారు.