ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
ADB: ఇచ్చోడ మండలంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలచారి ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు పంచారు. నాయకురాలు సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.