సింగరేణి OCP-5 ప్రాజెక్టును పరిశీలించిన GM

PDPL: రామగుండం సింగరేణి సంస్థ GDK - OCP- 5 ప్రాజెక్టును GM (సేఫ్టీ) మధుసూదన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులోని క్వారీలో తీసుకుంటున్న రక్షణ చర్యలపై సమీక్షించి, అధికారులకు సూచనలు, సలహాలు చేశారు. రక్షణ పట్ల ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులు సాయి ప్రసాద్, పొనుగోటి శ్రీనివాస్, రమేష్, దీటి చంద్రమౌళి ఉన్నారు.