సలేశ్వరం జాతర.. సర్కార్‌పై భక్తుల ఫైర్
TG: నల్లమల అడవిలో జరుగుతున్న సలేశ్వరం జాతర సందర్భంగా శివయ్యను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంతంలో వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భక్తులు మండిపడుతున్నారు. ఒక్కో కారుకు పోలీసులు రూ.500 వరకు తీసుకుంటున్నారని.. ఆలయం దగ్గర మాత్రం ఒక్క పోలీసు కూడా కనిపించడం లేదని ధ్వజమెత్తారు. దర్శనానికి 3 రోజులే అనుమతి ఇవ్వడంపై భక్తులు అసంతృప్తితో ఉన్నారు.