మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు: సీఐ
KDP: మైదుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు నెలల కాలంలో మద్యం తాగి వాహనాలు నడిపిన 107 మందిపై కేసులు నమోదు చేసినట్లు పట్టణ సీఐ రమణారెడ్డి శనివారం తెలిపారు. బహిరంగ ప్రదేశంలో మద్యం తాగి ప్రజలకు భంగం కలిగించిన 162 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. అనంతరం మద్యం తాగి వాహనాలను నడిపితే చర్యలు తప్పవన్నారు.