బల్లికురవ మండల సర్వసభ్య సమావేశం వాయిదా

బల్లికురవ మండల సర్వసభ్య సమావేశం వాయిదా

బాపట్ల: బల్లికురవ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించాల్సిన మండల సర్వసభ్య సమావేశం కోరం లేకపోవడంతో వాయిదా పడింది. సభ్యులు తగిన సంఖ్యలో హాజరు కాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేసినట్లు మండల ఎంపీడీవో కుసుమకుమారి తెలిపారు. సమావేశాన్ని మరలా ఎప్పుడు నిర్వహించేది అనే విషయాన్ని త్వరలో తెలియజేస్తామని ఆమె పేర్కొన్నారు.