రేపు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

SRD: నారాయణఖేడ్ మండలం లింగాపూర్ గ్రామంలోని వెంకటేశ్వర ఆలయంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు భవాని మాతకు బోనాల సమర్పణ, రేపు బుధవారం ఉదయం 10:45 గంటల సుముహూర్తంలో శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి కళ్యాణం జరుగుతుందన్నారు. భక్తులు జయప్రదం చేయాలని కోరారు.