అధికారుల నిర్లక్ష్యం.. వైరాలో నెల రోజులుగా తాగునీరు వృథా

అధికారుల నిర్లక్ష్యం.. వైరాలో నెల రోజులుగా తాగునీరు వృథా

KMM: వైరా మండలం పాలడుగు-వల్లపురం మార్గంలో మిషన్ భగీరథ నీరు భారీగా వృథా అవుతోంది. విద్యుత్ స్తంభం నాటేటప్పుడు నీటి పైపు పగలడం వల్ల నెల రోజులుగా కిలోమీటర్ మేర నీరు పోతోంది. 'నీరు అమూల్యం' అంటూనే ప్రభుత్వ శాఖలు ఇలా నిర్లక్ష్యం వహిస్తే ఎలా అంటూ ప్రయాణికులు, పాదచారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.