రోడ్డు ప్రమాదంలో గాయపడిన కార్యకర్తకు ఎమ్మెల్యే కోట్ల పరామర్శ
NDL: ప్యాపిలి మండలం గార్లదిన్నె గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ యాదవ్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్ళి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పార్టీపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.