విజయవాడలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
NTR: విజయవాడలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా NH సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. గొల్లపూడి వైపు నుంచి వచ్చే వాహనాలకు ఇకపై వెస్ట్ బైపాస్ ద్వారా నేరుగా చిన్న కాకాని హైలాండ్ వరకు వెళ్లేందుకు ఈనెల 10 నుంచి CARS, బైక్ లకు అనుమతి ఇస్తున్నారు. ఈనెల 20 నుంచి లారీల సహా భారీ వాహనాలకు అనుమతి ఇవ్వనున్నారు. కొత్త మార్గంతో గుంటూరు హైవే చేరడానికి ప్రయాణ సమయం తగ్గనుంది.