VIDEO: రైతన్నలను వణికిస్తున్న వాతావరణం
కోనసీమ: ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న అకాల వర్షాలు, తుపాన్ ప్రభావాలతో అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. పంట కోతల సమయం కావడంతో కురుస్తున్న అకాల వర్షాలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తపేట నియోజకవర్గం వ్యాప్తంగా వరి కోత నుంచి సేకరించిన ధాన్యాన్ని భద్రపరుచుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.