గ్యాస్ సిలిండర్ల కొరత లేదు.. ఆందోళన చెందవద్దు: కలెక్టర్
నిజామాబాద్: వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జిల్లా అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 5,81,769 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని.. 33 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సరఫరా జరుగుతోందని తెలిపారు.