VIDEO: జాతీయ రహదారిపై రాంగ్ రూట్ లో వెళ్లదు : సీఐ
SRD: కల్హేర్ మండలం పరిధి హైవే రోడ్డుపై వాహనదారులు రాంగ్ రూట్‌లో వెళ్లొద్దని కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. మాసంపల్లి, మహదేవ్ పల్లి, బాచేపల్లి, బల్కంచల్క తండా, మునిగేపల్లి, నిజాంపేట వరకు ఉన్న 161 జాతీయ రహదారిపై వాహనదారులు రోడ్డు నిబంధనలు తప్పక పాటించాలన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని సూచించారు.