కారు ఢీకొని వ్యక్తికి గాయాలు

కారు ఢీకొని వ్యక్తికి గాయాలు

అన్నమయ్య: మదనపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద కారు ఢీకొని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్బిఐ కాలనీకి చెందిన నగేష్(36) సైకిల్‌పై బెంగళూరు బస్టాండ్‌కు వెళుతుండగా పాఠశాల వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్ దగ్గర గురువారం రాత్రి కారు ఢీకొని వెళ్లిపోయింది. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని స్థానికులు గమనించి 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.