బీఎన్ రెడ్డి స్తూపం ఆవిష్కరణ

SRPT: తుంగతుర్తిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎంపీ భీంరెడ్డి నర్సింహారెడ్డి స్థూపాన్ని ఎంసీపీఐయూ జాతీయ కార్యదర్శి మద్దికాయల అశోక్ శుక్రవారం ఆవిష్కరించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రజల కోసం బీఎన్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో తాటికొండ సీతయ్య, రాములు గౌడ్, రమేష్, వెంకన్న, నజీర్, విజయమ్మ పాల్గొన్నారు.