గుర్తుతెలియని మృతదేహం లభ్యం
VZM: ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి శ్రీనగర్ కాలనీకి వెళ్ళే దారి కల్లాల బావిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు సీఐ చౌదరి తెలిపారు. మృతిని వయస్సు సుమారు 45 నుంచి 50 మధ్య ఉంటుందన్నారు. మృతుని ఒంటిపై తెలుపు రంగుపై టీ షర్ట్, లుంగీ ధరించినట్లు పేర్కొన్నారు. మృతదేహన్ని ప్రభుత్వ శవగారంలో భద్రపరిచినట్లు చెప్పారు. వివరాలకు నంబర్ 9121109419కు సంప్రదించాలన్నారు.