జాతరకు పకడ్బందీ భద్రతా చర్యలు
HNK: కాజీపేట మండలం అమ్మవారి పేటలో జరుగుతున్న సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా జాతర ప్రాంగణాన్ని మంగళవారం సెంట్రల్ జోన్ డీసీపీ కవిత పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఖాజీపేట ఏసీపీ, మడికొండ సీఐ, ఎస్సైలు, పోలీసు సిబ్బందితో కలిసి భద్రతా ఏర్పాట్లు, భక్తుల రాకపోకలను పరిశీలించారు. జాతరను శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.