పెనుగొండలో సీఐటీయు ఆధ్వర్యంలో నిరసనలు
W.G: పెనుగొండలో ఇవాళ సీఐటీయు ఆధ్వర్యంలో అంగన్వాడీ, ఆశ, వివో ఏలు నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లేబర్ కోడ్లు అమలుకు ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేయాలని CITU జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. నవంబర్ 29, 30 తేదీల్లో పెనుగొండలో జరిగే పశ్చిమగోదావరి జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కార్మికులను కోరారు.